/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/summer-jpg.webp)
Summer Season : వేసవి కాలం(Summer) రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కనీసం మార్చి నెల రాకముందే.. ఇంట్లో ఉక్కపోత మొదలైపోయింది. ఫిబ్రవరి ఆరంభం నుంచే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గురువారం నాటికి దాదాపు 40 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే మరో నాలుగు రోజుల్లో మరింత తీవ్రమైన వేడి వాతావరణ(Weather) పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది.
Also Read: భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా
16 నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఉదయం పూట, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ నెలలో 10,11 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ఇక 16వ తేది నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయని హెచ్చరించింది.
ఏప్రిల్, మేలో పరిస్థితి..!
ఇదిలా ఉండగా అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలోనే ఇంతగా ఎండలు ఉంటే.. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల్లో చూసుకుంటే గ్రేటర్ పరిధిలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లిహిల్స్‌లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3 చొప్పున ఉష్ణగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం ఇంకా ఎలా ఉంటుందోనని ఆందోళన నెలకొంది.
Also Read: తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ… సీఎం రేవంత్ కీలక నిర్ణయం!