HYD CP: సీఎం రేవంత్ ఆదేశాలు.. వారికి హైదరాబాద్ సీపీ హెచ్చరిక

హైద్రాబాదు నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి డ్రగ్స్‌ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు. రెండు నెలల్లోగా వారి బిజినెస్ మూసివేయాలని డెడ్ లైన్ విధించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులను హెచ్చరించారు.

HYD CP: సీఎం రేవంత్ ఆదేశాలు.. వారికి హైదరాబాద్ సీపీ హెచ్చరిక
New Update

Hyderabad CP K. Srinivasa Reddy: హైదరాబాద్ లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల భారిన పడకుండా చర్యలు చేపడుతున్నారు సీపీ.

ALSO READ: BREAKING: 11 మంది IASల బదిలీ

తాజాగా డ్రగ్స్‌ మాఫియాకు హైదరాబాద్‌ నూతన పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి డెడ్‌లైన్‌ ఇచ్చారు. డ్రగ్స్‌, గంజాయి దందాను ఆపేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అన్నీ దందాలు ఆపేసేందుకు రెండు నెలలే టైం ఇస్తున్నట్లు వెల్లడించారు. కేవలం బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అని వ్యాఖ్యానించారు. నేరగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ దందాను పూర్తిగా కట్టడి చేయాలని సిటీ పోలీసులకు సీపీ ఆదేశాలు ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులను హెచ్చరించారు.

అసెంబ్లీలో డ్రగ్స్ పై రగడ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అడ్డాగా జరుగుతున్న డ్రగ్స్ మాఫియాపై చర్చను లేవనెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే హైదరాబాద్ లో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ పెరిగిందని మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యువత మద్యానికి, మత్తు పదార్థాలు బానిసలయ్యారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల్లో వాడకం లేదా సరఫరా లాంటి విషయాలలో దొరికితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.

#telangana-news #cm-revanth-reddy #hyderabad-cp #drugs-case-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe