French Fries: కర్ణాటకకి చెందిన ఓ యువ జంటకు ఇటీవలే బిడ్డ పుట్టింది. దీంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆమెకు పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని సూచించాడు. ఆరోగ్యానికి మేలు చేసేది ఏది అడిగినా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో భార్య తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని భర్తను తీసుకుని రావాల్సిందిగా అడిగింది.
బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ వద్దని భర్త అభ్యంతరం చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహహింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు లో తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అసలు విషయం తెలుసుకుని ఇద్దరికీ రాజీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ భార్య మాత్రం వినిపించుకోలేదు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టాల్సిందే అని మొండికేసింది.
దాంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలంటూ కోరాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకుని భార్యకు చివాట్లు పెట్టారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని మందలించారు. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లేందుకు అనుమతించారు.
Aslo Read: N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్