French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న భర్త..గృహహింస కేసు పెట్టిన భార్య! బాలింతరాలిగా ఉన్న భార్యను ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు భర్త పై గృహ హింస కేసు పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని కోర్టు ఆమెని మందలించింది. By Bhavana 24 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి French Fries: కర్ణాటకకి చెందిన ఓ యువ జంటకు ఇటీవలే బిడ్డ పుట్టింది. దీంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆమెకు పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని సూచించాడు. ఆరోగ్యానికి మేలు చేసేది ఏది అడిగినా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో భార్య తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని భర్తను తీసుకుని రావాల్సిందిగా అడిగింది. బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ వద్దని భర్త అభ్యంతరం చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహహింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు లో తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అసలు విషయం తెలుసుకుని ఇద్దరికీ రాజీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ భార్య మాత్రం వినిపించుకోలేదు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టాల్సిందే అని మొండికేసింది. దాంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలంటూ కోరాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకుని భార్యకు చివాట్లు పెట్టారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని మందలించారు. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లేందుకు అనుమతించారు. Aslo Read: N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్ #karnataka #wife #husband #case #eating #french-fries మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి