ఉప్పల్‌లోని న్యూభరత్ లో హోటల్‌లో పని చేస్తున్న మధుస్మిత, ప్రదీప బోలాలు ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరు తరుచూ గొడవు పడుతూ ఉండేవారు. భర్త ప్రదీప్‌కు మధుస్మిత మీద అనుమానం. దానికి ఆమె ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడ్డం, రీల్స్ చేస్తుండడమే కారణం. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడుతుండేవారు. శుక్రవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అదికాస్తా ఎక్కువై చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ప్రదీప్ ఆమె మెడకు చున్నిని బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు.
ఈ మర్డర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు. నాలుగు టీం లతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బేగంపేట ఏరియాలో ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రదీప్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని రాచకొండ, మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు.
Also Read:Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత