Israel-Hamas War: గాజాలో ఖాళీ అవుతున్న అల్-షిఫా ఆసుపత్రి.. వందలాది మంది బయటకు .. హమాస్‌ను అంతం చేసేందుకు గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. దక్షిణ గాజాలో ఉన్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 18 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ క్రమంలోనే దక్షిణా గాజాలో ఉన్నటువంటి పాలస్తీనా ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు గాజా ప్రాంతంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి కూడా ఖాళీ అయిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఆస్పత్రుల్లో తలదాచుకుంటున్న వందలాది మంది పౌరులతో సహా.. రోగులు, వైద్య సిబ్బంది వేరే చోటుకి వెళ్లిపోయారని గాజా ఆరోగ్య విభాగం వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆసుపత్రిని ఖాళీ చేయాలని తమకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. Also read: చాట్‌జీపీటీ సృష్టికర్తపై వేటు.. కంపెనీ సీఈఓగా తొలగింపు.. కారణం ఇదే.. మరోవైపు తాము అల్-షిఫా ఆసుపత్రికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. వేరేచోటికి వెళ్లాలనుకునేవారికి తాము సురక్షితమమైన మార్గాన్ని కల్పిస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. ఇదిలాఉండగా.. గాజాలో పలుచోట్ల పాక్షికంగా ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించారు. ఉత్తర గాజాపై హమాస్ తమ నియంత్రణను కోల్పోయిందని.. అందుకే వారి భద్రత కోసం గాజా పౌరులను వేరే చోటుకి వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల్లో దాదాపు 11,400 మంది మృతి చెందగా.. మరో 2700 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. Also Read: షాకింగ్ న్యూస్.. ధూమపానం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో తెలుసా? #telugu-news #israel-attack #israel-hamas #hamas-israel-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి