గత ఏడాది ఓపెన్ఏఐ సంస్థ చాట్‌జీపీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది లాంచ్ అయిన కొద్దిరోజులకే సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది చాట్‌జీపీటీ యూజర్లుగా మారిపోయారు. ఇది భవిష్యత్తులో గూగుల్‌ను బీట్ చేస్తుందంటూ అప్పట్లో వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రసుతం ఈ ఓపెన్ఏఐ కంపెనీలో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరైన ‘శామ్ అల్ట్‌మాన్’ను తొలగించేశారు. ఓపెన్ఏఐ బోర్టు సభ్యులైన.. చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్కేవర్, కోరా సీఈఓ డీ అంజెలో సహా తదితరులు.. శామ్ అల్ట్మాన్ను సీఈఓ నుంచి తప్పించారు. అయితే శామ్ అల్డ్మాన్ బోర్టు సభ్యులతో నిజాయతీ పాటించడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని.. ఈ కంపెనీని నడిపే సామార్థ్యం అతనికి లేదని బోర్టు సభ్యులు నిర్ణయించారని అందుకే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించారని ఓపెన్ఏఐ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్తపై వేటు.. కంపెనీ సీఈఓగా తొలగింపు.. కారణం ఇదే..
ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరైన 'శామ్ అల్ట్‌మాన్'ను.. ఆ కంపెనీ బోర్డు సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు. సరైన సమాచారం పంచుకోవడం లేదనే కారణంతోనే బోర్డు సభ్యులు ఆయన్ని తొలగించినట్లు ఓపెన్ఏఐ కంపెనీ తెలిపింది.
Translate this News: