No Petrol : రేపటి నుంచి పెట్రోల్ బంద్ అని ప్రచారం.. బంకుల ముందు భారీ క్యూలు

హైదరాబాద్‌లో రేపటి నుంచి పెట్రోల్‌ బంకులు బంద్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో పెట్రోల్ బంకులు ముందు జనాలు క్యూలు కడుతున్నారు. దానికితోడు చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు.

New Update
No Petrol : రేపటి నుంచి పెట్రోల్ బంద్ అని ప్రచారం.. బంకుల ముందు భారీ క్యూలు

Petrol Bunks : ఎక్కడ నుంచి వచ్చిందో... ఎవరు చెప్పారో తెలియదు కానీ... హైదరాబాద్‌(Hyderabad) లో రేపటి నుంచి పెట్రోల్ బంకులు క్లోస్(Petrol Bunks Close) అవుతాయని న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో హైదరాబాద్‌లో వాహనదారులు బంకుల మధ్య క్యూ కట్టారు. ఇవన్నీ వదంతులేనని...పెట్రోల్ బంకులు క్లోజ్ అవ్వవు అని చెబుతున్నా... వాహనదారులు వినడం లేదు. దాంతో పాటూ కొన్ని బంకుల ముందు అప్పుడే నో స్టాక్ బోర్డులుకూడా పెట్టేశారు.

Also read : ఒడిదుడుకుల్లో సెన్సెక్స్…నష్టాలతో ప్రారంభమైన సూచీలు

ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌(All India Motor Transport) ప్రెసిడెంట్ బల్ మల్కిత్ సింగ్ పెట్రోల్ బంకులు బంద్ వార్తలను కొట్టివేశారు. దేశవ్యాప్తంగా ఎలాంటి డ్రైవర్ల సమ్మె లేదన్న మల్కిత్ సింగ్ తెలిపారు. వదంతులు నమ్మవద్దంటున్న మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ చెబుతోంది. పెట్రోల్ యథావిధిగా సరఫరా అవుతుందని స్పష్టం చేశారు.

అంతకుముందు జనవరి 3వ తేదీన కూడా మూడు రోజులపాటు పెట్రోల్ బంకులు మూత పడనున్నాయి అని ప్రచారం జరగడంతో వాహనదారులందరూ పెట్రోల్ బంకుల ఎదుట క్యూ కట్టారు. రోడ్డు పక్కనే పెట్రోల్‌ బంకులుండటంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు పెట్రోల్ బంకుల ఎదుట గంటల కొద్దీ వెయిట్ చేశారు. మరోవైపు కొన్ని బంకుల్లో పెట్రోల్ నిలువ లేకపోవడంతో నో స్టాక్(No Stock) బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్ని బంకులు నిన్న, ఈరోజు కూడా మూతపడ్డాయి. ఈ రోజు కూడా హైదరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో వాహదారులు ఇబ్బంది పడుతున్నారు.

Also Read:ప్లీజ్ నన్ను కాల్చొద్దు… లైవ్‌లో దుండగులను అభ్యర్ధించిన న్యూస్ ప్రెజెంటర్

Advertisment
తాజా కథనాలు