Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!! అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు. By Bhoomi 19 Jan 2024 in జాబ్స్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ayodhya Ram Mandir: దేశమంతా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎక్కడ చూసిన రామయ్య పేరే వినిపిస్తోంది. రాములవారి పేరును తలచుకుంటూ రామభక్తులు పులకించిపోతున్నారు. బాలరాముడిని చూసిన భక్తులు ప్రత్యక్ష దర్శనం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈనేపథ్యంలో అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవంతో హాస్పిటాలిటీ,(Hospitality) ట్రావెల్స్ అండ్ టూరిజం (Travels and Tourism)రంగంలో 20వేల ఉద్యోగాలు ఏర్పాడ్డాయి. అయితే ఈ నగరానికి రోజు లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. అందుకే రాబోచే నెలల్లో ఉపాధిలో నిరంతర పెరుగుదల అంచనా వేసారు. రాండ్ స్టాడ్ ఇండియాచీఫ్ కమర్షియల్(Randstad IndiaChief Commercial) ఆఫీసర్ యేషాబ్ గిరి మాట్లాడారు. రామాలయం అయోధ్యను గ్లోబల్ టూరిజం హబ్ (global tourism hub)గా మారుస్తుందని రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది సందర్శకులు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకుల రాకపోకలు పెరగడంతో అయోధ్యలో వసతి ఇంకా ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. దీంతో అయోధ్యలో ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వతంగా, తాత్కాలిక నియామాకాలు 20వే లనుంచి 25వేల వరకు ఉండే అవకాశం ఉంది. హాస్పిటాలిటీ మేనేజర్, రెస్టారెంట్ అండ్ హోటల్ సిబ్బంది, లాజిస్టిక్స్ మేనేజర్లు, హోటల్ స్టాఫ్, కుక్ లు అలాగే డ్రైవర్లతో సహా హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం సంబంధించి పలు పోస్టుల్లో గత 6నెలల్లో సుమారు పదివేల నుంచి 20వేల ఉద్యోగాలు కొత్తగా ఏర్పడినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ లో పాపులర్ టూవీలర్స్ ఇవే…వీటికి మార్కెట్లో పిచ్చ క్రేజ్..!! అయోధ్యలోనే కాదు..లక్నో, కాన్పూర్, గోరఖ్ పూర్, వంటి పొరుగనగరాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో ఆలయరోజువారీ అవసరాలకు ఎంతమంది ఉద్యోగులు అవసరం అనే లెక్కలు కూడా తేలనున్నాయి. 2 నుంచి 3లక్షల మంది సందర్శకులు ఉంటారే అంచనా నిజమైతే భక్తుల వసతి, లాజిస్టిక్స్, ఆహార అవసరాలు తీర్చేందుకు మరింత సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ ఉద్యోగాలు చాలా వరకు తాత్కాలికమే అయినప్పటికి కూడా ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కారణంగా భారీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. #ayodhya-ram-mandir #jobs #job-opportunity #ayodhya-jobs #ayodhya-rammandir #ayodhya-rammandir-jobs #rammandir-inauguration #tourism-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి