Two-Wheelers : భారత్ లో పాపులర్ టూవీలర్స్ ఇవే...వీటికి మార్కెట్లో పిచ్చ క్రేజ్..!!

ఇండియాలో టూవీలర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. చాలా మంది టూవీలర్స్ ను కొనేందుకు ఇష్టపడుతుంటారు. బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్ , హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ హీరో ప్యాషన్ బైకులు మన దేశంలో చాలా పాపులర్.ఫుడ్ డెలవరీ కంపెనీలకు ఈ ఐదు బైకులు బెస్ట్ ఆప్షన్ గా మారాయి.

New Update
Two-Wheelers : భారత్ లో పాపులర్ టూవీలర్స్ ఇవే...వీటికి మార్కెట్లో పిచ్చ క్రేజ్..!!

Two-Wheelers : టూవీలర్ అనేది భారతీయులకు సాధారణం అవసరం. చాలా మంది ప్రయాణాల కోసం ఏదొక బైక్ (bike)ను వాడుతూనే ఉన్నారు. అన్ని రకాల బడ్జెట్ రేంజ్ కు తగ్గట్లుగా కంపెనీ పలు మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఫుడ్, గూడ్స్ డెలివరీకి చాలా మంది గిగ్ వర్కర్లు (Gig workers)కొన్ని బైకులను మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్(E-commerce) కంపెనీల డెలివరీ పార్ట్నర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా ఉన్న బైకుల గురించి తెలుసుకుందాం.

బజాజ్ ప్లాటినా:
భారత్ లో 2006లో మొదటిసారి అమ్మకానికి వచ్చింది ఈ బైక్. భారీ మైలేజ్ అందిస్తూ లాంగ్ జర్నీలకు బెస్ట్ బైక్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఈ మోటార్ సైకిల్ 100సీసీ, 110 సీసీ వంటి రెండు ఇంజన్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ధర తక్కువగా ఉండటం, మంచి మైలేజీతో ప్రయాణ ఖర్చులు తగ్గడంతో డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది కేరాఫ్ అడ్రస్ గా మారింది.

హీరో స్ప్లెండర్ :
హీరో మోటోకార్ప్ కంపెనీ భారత టూవీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి స్ప్లెండర్ ఎంతో ముందుంటుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఈ బడ్జెట్ రేంజ్ బైక్ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే బెస్ట్ బైక్ గా నిలుస్తోంది. అయితే ట్రాన్స్ పోర్టేషన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంది. చాలా మంది గిగ్ డెలివరీ రైడర్స్, డెలివరీ సర్వీస్ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఇదే మోడల్ నె ఎంచుకుంటున్నారు.

హోండా యాక్టివా:
భారత టూవీలర్ మార్కెట్లో చాలా పాపులర్ ఇది. హోండా కంపెనీ ఇండియాలో రెండో అతిపెద్ద టూవీలర్ మార్కెట్ ను సొంతం చేసుకునేందుకు యాక్టివా స్కూటీ ప్రధాన కారణమని చెప్పవచ్చు. వ్యక్తిగత అవసరాలకు చాలా మంది ఈ మోడల్ ను ఎంచుకుంటున్నారు. అయితే గిగ్ డెలివరీ రైడర్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

హీరో ఫ్యాషన్:
హీరో ఫ్యాషన్ బైక్ 2001లో లాంచ్ అయ్యింది. ఇది ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్ ను సాధించింది. ఫ్యాషన్ ప్లస్, ఫ్యాషన్ ఎక్స్ టెక్, మోడళ్లు 100సీసీ, 110సీసీ ఇంజిన్లతో ఎక్కుమందిని ఆకర్షించాయి. ధర తక్కువగా ఉండటం, మంచి మైలేజ్ అందించడంతో చాలామంది డెలివరీ వర్కర్లు ఈ బైకును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మృతి

Advertisment
Advertisment