Beauty Tips : ఈ ఒక్క పండును మీ చర్మం రష్మిక మందన్న లాగా మెరిసిపోతుంది! విటమిన్-సీ పుష్కలంగా ఉండే నారింజ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు మీ అందం రెట్టింపు అవ్వాలంటే నారింజలను తినవచ్చు. నారింజ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నారింజ కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 28 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Orange : శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్-సి(Vitamin-C) ఒకటి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఇది. స్కర్వి లాంటి వ్యాధుల నుంచి రక్షించే విటమిన్ కూడా ఇదే. ప్రజలందరూ క్రమం తప్పకుండా ఆహారంలో విటమిన్-C ని చేర్చుకోవాలి. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్(Anti Oxidant) గా కూడా పనిచేస్తుంది. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. విటమిన్-సి మీ శరీరం కొల్లాజెన్ తయారు చేయడానికి సహాయపడుతుంది. కొల్లాజెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది గాయాలను నయం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నారింజ పండ్లను రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది: సిట్రస్ పండ్లులో విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. నారింజను తినవచ్చు.. ఈ ఒక్క పండు మీ విటమిన్-సి అవసరాలను తీర్చుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నారింజ పండ్లలో(Orange Fruits) విటమిన్-సితో పాటు ఫైబర్, విటమిన్-ఎ, కాల్షియం కూడా లభిస్తాయి. అంటే ఈ ఒక్క పండును తినడం ద్వారా మీరు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరానికి రోజూ 75-90 మిల్లీగ్రాముల విటమిన్-సి అవసరమని పరిశోధకులు చెబుతుంటారు. దీనిని నారింజ పండ్లతో సులభంగా భర్తీ చేయవచ్చు. 100 గ్రాముల నారింజ నుంచి సుమారు 53 మి.గ్రా. విటమిన్-సి పొందవచ్చు. అంటే 150-200 గ్రాముల నారింజ పండ్లను రోజూ తింటే ఎంతో ఆరోగ్యం. ఇది చర్మనికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు నారింజ, ఇతర సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్(Diabetes) తో సహా అనేక ఇతర రకాల వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుంది. సిట్రస్ పండ్ల వినియోగం కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మ సంబంధిత వ్యాధులను(Skin Diseases) నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లతో సహా నారింజలో కనిపించే అనేక పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి నారింజ బెస్ట్. ఇది కూడా చదవండి: మార్నింగ్ నిద్రలేవగానే ఈ పని చేస్తే మీ లైఫ్ గోవిందే..తప్పక తెలుసుకోండి! గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #best-health-tips #vitamin-c #orange-fruit #skin-and-heart మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి