Millet Upma : రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మిల్లెట్ ఉప్మా ఇలా చేయండి ఉదయం అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే..బజ్రా ఉప్మా ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 23 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Millet Upma : ఉదయం రకరకాలు టిఫిన్లు(Tiffin) తింటారు. అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే.. బజ్రా ఉప్మా(Millet Upma) ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే అనేక రకాల పోషకాలను కలిగి ఉన్న ఫుడ్. దీన్ని ఆహారంలో అనేక విధాలుగా తీసుకోవచ్చు. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉప్మా.. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌ల జాబితాలో చేరింది. అంతేకాదు చలికాలం(Winter Season) లో దీనిని తింటే ఎన్నో లాభాలున్నాయని వైద్యులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, కెరోటిన్, లెసిథిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B3 శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా అనేక కడుపు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బజ్రా ఉప్మా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సినవి: ఈ ఫుడ్ చేయాడానికి కావలసినవి కప్పు జొన్న మిల్లెట్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి-అల్లం పేస్ట్, టమోటా, క్యాప్సికం, నూనె, ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీరు, కొద్దిగా కొత్తిమీర. తయారీ విధానం: ముందు రోజు రాత్రి జొన్నను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం సిద్ధం చేయడానికి ముందు ఉడకబెట్టండి. గిన్నెలో ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ , అల్లం(Ginger) - వెల్లుల్లి(Garlic) పేస్ట్, నూనె, ఆవాలు, జీలకర్ర, ఉప్పు వేసి అన్ని కలపాలి. మిశ్రమాన్ని మైక్రోవేవ్‌లో 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత బయటకు తీసి అందులో ఉడికించిన జొన్నలు, టమాటాలు వేయాలి. బాగా కలపి మరో 5 నిమిషాలు ఉడికించాలి. దీని తర్వాత గిన్నె తీసి నీళ్లు పోసి బాగా కలిపి మళ్లీ 10 నిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే దించుకోవాలి. ఈ మిల్లెట్ ఉప్మాను చట్నీ, ఊరగాయతో వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ ఉప్మా వంటకం పైన నిమ్మకాయ, సన్నగా తరిగిన సీజనల్ కూరగాయలను కూడా కలుపుకోవచ్చు. మిల్లెట్ ప్రయోజనాలు: ఈ మిల్లెట్లో సోడియం, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ పుష్కలం. మిల్లెట్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటే, కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. గర్భధారణ సమయం(Pregnancy Time) లో మిల్లెట్ తింటే మరింత మంచిది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత రానివ్వదు. పిల్లల శారీరక, మానసిక వికాసానికి కూడా మిల్లెట్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇది కూడా చదవండి: గ్రీన్ పీస్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #millet-upma #health-tips-for-winter-season #health-benefits #healthy-food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి