Mobile Addiction: కరోనా తర్వాత మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం చాలా పెరిగింది. మొబైల్ వ్యసనం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఓవైపు వైద్యులు చెబుతున్నారు. నిద్ర, విశ్వాసం, ఆనందం, ఆరోగ్యం, సంబంధాలు, సంతృప్తి, లక్ష్యాలు ఆరోగ్యపై ప్రభావితం చూపుతాయి. ప్రస్తుతం ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో షాపింగ్ చేయడం, రీల్స్, వాట్సాప్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, గేమ్స్, పోర్నోగ్రఫీ లాంటి అనేక ఆప్షన్లు పిల్లలు, పెద్దల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా చూస్తే ఎక్కడో ఏదో క్లిక్ చేస్తే అది అలవాటు ఉంటుంది. మొబైల్‌కు కొన్నిరకాల లింకులు పదేపదే వస్తూనే ఉంటాయి. ఫోన్ వాడకం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఫోన్లను అతిగా వాడతే..:
- ఈ కాలం పిల్లలు రాత్రింబవళ్లు ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం వలన, వ్యాయామం, అభిరుచులు, తినడం, తాగడం, ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, ఒకరితో ఒకరు ఆడుకోవడం వంటివన్నీ వెనుకబడిపోయి పిల్లలు వీలైనంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
- ఫోన్ పట్టుకుని కూర్చునే విధానం వల్ల బరువు పెరుగుతారు. దీంతో పాటు కంటి, ఆత్మవిశ్వం, ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.
దీనివలన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
తల్లిదండ్రులు ఏం చేయాలి..?
- పిల్లలు ఫోన్ వాడే విషయంలో కుటుంబ సభ్యులు ఒక పరిష్కారంగా పనిచేయాలి. పిల్లలకు కొత్త దృక్పథం, కొత్త లక్ష్యం, కొత్త ఆత్మవిశ్వాసంపై వారికి చెబితే మార్పు వచ్చి సొంతంగా అడులు ముందుకు వేస్తారు. ఇలా పిల్లల కోసం స్పృహతో పని చేసి..ఇంట్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఒకే నియమాలు పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఏమి చేస్తారో పిల్లలు వెంటనే నేర్పించాలి.
ఈ చిట్కాతో మొబైల్ వాడకం దూరం:
- ఉదయం నిద్రలేచక పెరట్లో గడపండి.
- స్నానానికి, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు ఫోన్ వెంట తీసుకెళ్లకూడదు.
- అన్ని నోటిఫికేషన్లను ఆఫ్ చేసి ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టండి.
- రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను బెడ్‌కి దూరంగా పెట్టాలి.
ఇది కూడా చదవండి: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.