/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-54-1.jpg)
ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామాల్లో హైడ్రా ఆపరేషన్ జరుగుతోంది. చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ చర్యలు అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు కాపాడే లక్ష్యం దిశగా హైడ్రా ముందుకు సాగుతోంది.
Also Read: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా!
ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాలను హైడ్రా స్వాధీనం చేసుకోవడమే గాక.. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేస్తోంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలను కూడా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడా ఏ నిర్మాణాలను బుల్డొజర్లతో కూల్చివేస్తారన్న ఆందోళన అక్రమార్కుల్లో మొదలైంది.
ప్రస్తుతం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ బోర్డులు పెట్టి, వెంచర్లు వేసి ఫేక్ పత్రాలు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత ఆ స్థలాలను వేరేవాళ్లకి అమ్మేసి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో మన ఆస్తులు సురక్షితమేనా, బుల్డోజర్లు వస్తాయా ? అని చాలామందిలో ఆందోళన నెలకొంది. అయితే మన ఆస్తులు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నాయా ? లేవా ? అనేది lakes.hmda.gov.in వైబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇందులో మన స్థలాలు ఎక్కడున్నాయనేది తెలుసుకోవచ్చు. అలాగే మన ఆస్తులకు కూడా హైడ్రా ప్రభావం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవచ్చు.
Also Read: నిమ్స్ లో 32 వేల వేతనంతో జాబ్స్.. డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ఛాన్స్!
ముందుగా ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో లేక్స్ అనే పేజీ వస్తుంది. జిల్లా, మండలం, గ్రామం సెలక్ట్ చేసుకోవాలి. దీంతో వాటి పరిధిలో ఉన్న సరస్సులు, చెరువులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఇందులో మన స్థలాలు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నాయా ? లేవా ? అని చూపిస్తుంది. దీనివల్ల మన ఆస్తులు హైడ్రా ప్రభావానికి గురవుతాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.
How to check your property is not in FTL buffer limits to avoid HYDRA effect .
1. Visit https://t.co/8GrSy7fSTW Page
2. Select District , Mandal/Circle , Village and check Lakes list
3. Click : CADASTRAL maps and look out for SY number and allowed buffer limit pic.twitter.com/scTTcauF9S— Realestate Patashala (@RPatashala) August 18, 2024