Life style:ఇంట్లో మొక్కలను అందంగా ఏర్పాటు చేసుకోండిలా..

ఇంట్లో చెట్లు పెట్టుకుంటే చాలా అందంగానే కాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అయితే ఇంట్లో ఏ చెట్లు పెట్టాలి..ఎం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలు.

Life style:ఇంట్లో మొక్కలను అందంగా ఏర్పాటు చేసుకోండిలా..
New Update

ఇంట్లో చెట్లని ఎలా పడితే అలా వాటిని పెడితే అందం రాదు. దానికి కూడా ఓ పద్ధతి ఉంంది. అలానే స్థలం,పెంచే విధానం గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. అప్పుడే అవి చూడ్డానికి చక్కగా ఉంటాయి. కొన్ని చెట్లకి ఎండ అవసరం ఉంటుంది. కొన్ని ఎండ లేకుండానే పెరుగుతాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

ముందుగా మొక్కలను పెట్టే కుండీలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని మొక్కలు త్వరగా పెరిగితే, మరికొన్ని లేట్ గా పెరుగుతాయి. చిన్న కుండీల్లో త్వరగా పెరిగే మొక్కలు పెడితే అవి సరిగ్గా పెరగకపోవడమే కాదు చూడ్డానికి కూడా బావుండవు. అలాగే పెద్ద పెద్ద కుండీల్లో చిన్ మొక్కలు కూడా అందాన్నివ్వవు.

Also Read:ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు

ముందుగా చెప్పుకున్నట్లు కొన్ని చెట్లకి ఎండ అవసరం ఉంటుంది. మరికొన్ని చెట్లకు అవసరం ఉండదు. ఎండ అవసరమయ్యే చెట్లని కిటికీలు ఉన్న ప్లేస్లో పెట్టడం లేదా ఆరు బయట పెట్టడం మంచిది. మిగతావాటిని ఇంట్లో మనకు నచ్చిన ప్లేస్లో సర్దుబాటు చేయొచ్చు.

ఇప్పుడు మార్కెట్లో వీల్స్ షెల్ఫ్స్, ఉండి అందులో మొక్కల కుండీలు పెట్టుకునేట్టుగా దొరుకుతున్నాయి. ఇవి కూడా చాలా బావుంటున్నాయి. వీటిపై చెట్లని పెట్టడం వల్ల ఎటంటే అటు ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. కొద్దిసేపు ఎండకి పెట్టి తీసేయొచ్చు. నీరు పోసేటప్పుడు డైరెక్ట్గా పంప్ దగ్గరికే తీసుకెళ్ళొచ్చు.

మొక్కలు అస్తమానం మార్చక్కర్లేదు.ప్రతిసారి కొత్తవే కొనాల్సిన అవసరం లేదు. మొక్కలు పెట్టేందుకు కొంచెం క్రియేటివిటీని జత చేస్తే చాలు. పాత కుర్చీలు, ఫర్నీచర్ని మొక్కలు పెట్టేందుకు వాడొచ్చు. ఓపెన్ డ్రాయర్స్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. వీటితో సమస్య ఉండదు. పాత వాటిని ఉపయోగించుకున్నట్లు ఉంటుంది. చూడ్డానికి వెరైటీగా కూడా ఉంటాయి.

చాలా మంది గోడలకు అటాచ్ చేసే షెల్ఫ్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటప్పుడు కేవలం చెట్ల బరువే కాకుండా, నీటి బరువుని గుర్తుంచుకుని ప్లాన్ చేయాలి. అప్పుడు ఆ షెల్ఫ్లు విరిగిపోకుండా గోడకి అటాచ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

చెట్లను పెట్టే కుండీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా మట్టి కుండీలు, చెక్క కుండీలు , షెల్ఫ్స్ పెట్టకపోవడమే మంచిది. వీటి బదులు మెటల్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే మట్టి కుండీలైతే నీటి మచ్చలు ఏర్పడతాయి. అవి రోజులు గడిచేకొద్దీ పెరుగుతాయి. అందుకే మెటల్వి కుండీలు, షెల్ఫ్స్ అయితే, అంతగా ఇబ్బంది ఉండదు. మెటల్ కుండీలు చూడ్డానిక కూడా చాలా బావుంటాయి.

#house #beauty #plants #tips #arrange
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe