Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది?

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు.

Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది?
New Update

Dates: ప్రస్తుత కాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. సమయాభావం వల్ల చాలాసార్లు వ్యాయామం, యోగా చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీని వల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో అనేక రకాల వ్యాధులు నయమవుతాయి.

ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే?

  • ఫ్రక్టోజ్ ఖర్జూరాల్లో ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తీసుకుంటే అది కడుపు నొప్పికి కారణం అవుతుంది. అలాగని ఖర్జూరాన్ని కడుపు నిండా తినడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పెంచుతుందని, వాపునకు కూడా కారణమవుతుందని అంటున్నారు.

ఉదయం తింటే ఏమవుతుంది?

  • అల్పాహారంగా రోజులో ఎప్పుడైనా ఖర్జూరాన్ని తినవచ్చు. ఖర్జూర పండ్లను ఉదయాన్నే తింటే శక్తి లభిస్తుంది. దీని వల్ల పేగులోని పురుగులు కూడా చనిపోతాయి. ఖర్జూరాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తింటే శరీరంలోని కొన్ని భాగాలను శుభ్రం చేస్తాయని నిపుణులు అంటున్నారు. గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖకాంతిని పెంచుతుంది. జుట్టు ఆయుష్షును కూడా పెంతాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వీటిని అల్పాహారంగా తీసుకుంటే కొవ్వు మొత్తం మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#best-health-tips #health-benefits #dates #good-health
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe