/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/How-many-benefits-of-eating-fried-palli-in-winter-jpg.webp)
Benefits Of Peanuts : చలికాలం వచ్చిందంటేనే రకరకాల ఇబ్బందులకు మనల్ని గురిచేస్తాయి. తినే ఆహారం, చర్మం, ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అవి తక్కువగానే అనిపిస్తుంది. అయితే.. పల్లీ(Peanuts) లు టైంపాస్‌కే కాదు చలికాలంలో తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు అంటున్నారు. చలికాలంలో చర్మం పొడిబారడం కూడా, తేమ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచిది. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తినాలో.. ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేయించిన పల్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- పల్లీల్లో విటమిన్-బి 3, నియాసిన్ మన శరీరంపై ఉన్న ముడతలను పోగొట్టి చర్మాన్ని(Skin) ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో దోహదపడుతుంది. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా చేపు కడుపు కడుపు నిండినట్టుగా ఉంటూ ఆకలి అనిపించదు.
- దీనివల్ల కండరాలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. శారీరక శ్రమ శ్రమతో పాటు కండరాలు కోలుకోవడానికి ఈ పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. వేరుశెనగల్లో ఉండే పోషకాలు క్యాన్సర్ సమస్య నుంచి రక్షించేందుకు ముఖ్యపాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి, తలనొప్పి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
- ఫోలేట్ అధికంగా ఉండటం వలన గర్భధారణ సమయంలో ఇది చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా అల్జీమర్స్ సమస్య ఉంటే వేరుశనగ మంచి ఫలితం లభిస్తుంది. ఉడికించిన వాటిని తిన్నా కూడా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వేరుశనగల్లో మా కాల్షియం, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్ అధికంగా ఉన్నాయి. ప్రతీరోజు మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలను తింటే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉండటంతోపాటు.. ఎన్నో ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ కషాయం తాగితే అనేక అనారోగ్య సమస్యలు పరార్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.