International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్-హమాస్ వార్ మొదలైన దగ్గర నుంచి వారు అటాక్‌లు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న దేశాల నౌకలన్నింటి మీదా హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు.

New Update
International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

Houthi Rebels Attacks:యెమెన్ హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ మీద కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం శాంతించినా..హౌతీ రెబల్స్ మాత్రం తగ్గడం లేదు. ఎర్ర సముద్రంలో నూకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్రం మీద కూడా అటాక్స్ పెంచేశారు. ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేసే అన్ని నౌకలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హిందూ మహాసముద్రంలో నాలుగు నౌకల మీద దాడులు చేశారు హౌతీ రెబల్స్. హిందూ మహా సముద్రంలో డ్రోన్ దాడులను ప్రారంభించామని.. MSC ఓరియన్ కంటైనర్ షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు చెప్పారు. పోర్చుగీస్- ఫ్లాగ్ ఉన్న MSC ఓరియన్ పోర్చుగల్, ఒమన్ మధ్య పని చేస్తోంది.

హౌతీ ఉగ్రవాదులు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి దాడులు చేస్తున్నారు. ఎర్ర సముద్రం, బాబ్ అల్- మందాబ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో డ్రోన్లు, క్షిపణులతో అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఈ దాడుల వలన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉన్నా కూడా హౌతీ రెబల్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వీరికి అమెరికా, బ్రిటన్ తిరిగి సమాధానం చెబుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు చేస్తూ స్పందిస్తున్నాయి. మరోవైపు ఇందులో రెండు మూడు సార్లు భారత సిబ్బంది ఉన్న నౌకలు కూడా దాడులకు గురయ్యాయి. గత ఆదివారం కూడా పనామా జెండాతో కూడిన ముడి చమురు ట్యాంకర్‌కు భారత నావికాదళం సహాయం చేసిందని వార్తలు వచ్చాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఈ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం. కాగా, ఓడలో 22 మంది భారతీయులతో సహా మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు.

Also read:Stock Market Today: బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న దూసుకుపోయాయి.. ఈరోజు మార్కెట్ పై నిపుణుల అభిప్రాయం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు