Telangana Elections: బీజేపీ అధికారంలోకి వస్తే అది చేసి చూపిస్తాం : అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఇందుకోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
New Update

మరో నాలుగురోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో.. అధికార, విపక్ష నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. రోజుకో ప్రాంతం తిరుగుతూ.. సభలు, సమావేశలతో బిజీబీజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓవైపు ప్రచారాల చేస్తూంటే.. మరోవైపు బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్‌లు ప్రచారాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Also read: వీడు మామూలోడు కాదు.. గంజాయి ఎక్కడ దాచాడో చూడండి..!

బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ బీ టీమ్‌లాంటిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని విమర్శించారు. రాష్ట్రంలో కృష్ణ పరీవాహక ప్రాంతం అభివృద్ధి చెందలేదని.. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఇందుకోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. బీఆర్ఎస్‌ పార్టీతో రాజకీయంగా లేదా సిద్ధాంతపరంగా ఎలాంటి పొత్తు అనేది ఉండని అమిత్‌ షా శనివారం నిర్వహించిన ఓ సభలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

#telugu-news #telangana-elections #amit-shah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe