వీడు మామూలోడు కాదు.. గంజాయి ఎక్కడ దాచాడో చూడండి..!

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారపల్లి ఎక్స్ రోడ్డు వద్ద డిసియం వ్యాన్ లో గంజాయి పట్టుబడింది. వ్యాన్ పైభాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ టైప్ లగేజీ క్యారియర్ లో గంజాయిని భద్రపరిచాడు నిందితుడు. వాహనం తనఖి చేయగా అడ్డంగా దొరికిపోయాడు.

New Update
వీడు మామూలోడు కాదు.. గంజాయి ఎక్కడ దాచాడో చూడండి..!

Crime News:  ‘పుష్ప’ సినిమా తరహాలోనే వాహనం కింది భాగంలో ప్రత్యేకంగా ఓ పెట్టెను అమర్చి, అందులో పెద్ద మొత్తంలో గంజాయిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు దుండగులు. ఓవైపు తెలంగాణలో ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. మరోవైపు గంజాయి స్మగ్లర్లు సైలెంట్‌గా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నప్పట్టికి ఏమాత్రం భయం లేకుండా రెచ్చిపోతున్నారు.. కోట్ల విలువైన గంజాయిని బార్డర్ దాటించేస్తున్నారు.

ఈ క్రమంలోనే..మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారపల్లి ఎక్స్ రోడ్డు వద్ద  డిసియం వ్యాన్ లో గంజాయి తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాన్ పైభాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ టైప్ లగేజీ క్యారియర్ లో గంజాయిని భద్రపరిచాడు నిందితుడు. ఎస్ఓటి మహేశ్వరం జోన్, రాచకొండ మేడిపల్లి పోలీసులు వాహనం తనఖి అడ్డంగా దొరికిపోయాడు.

Also Read: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల..

మున్ఫేట్ (38 )అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 450 కేజీల ఎండు గంజాయి, అశోక్ లేలాండ్ డీసీఎం, ఒక మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా ఒక కోటి 16 లక్షల 60 వేలు ఉంటుందని సమాచారం. నిందితుడు మున్ఫేట్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని తెలుస్తోంది. డ్రైవర్ గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. డ్రగ్ పెడ్లర్ సూచనల మేరకు ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరికి వెళ్లి ఒక సరఫరా దారి నుంచి 300 కేజీల గంజాయిని తీసుకొని అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి వెళ్లి మరో సరఫరా దారి నుంచి 150 కేజీల గంజాయిని సేకరించినట్లు సమాచారం. సూర్యపేట మీదుగా హైదరాబాద్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న నిందితుడిని పోలీసులు అడ్డుకున్నారు. తనిఖి చేసిన అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరిచారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు