/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-75-jpg.webp)
Titanic : టైటానిక్ సినిమా(Titanic Cinema) అభిమానులకు బ్యాడ్ న్యూ్స్. కెప్టెన్ బెర్నాల్డ్ హిల్(Captain Bernard Hill) (79) ఇకలేరనే వార్త సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 1997లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమ కథలో కెప్టెన్ పాత్రలో కనిపించిన హిల్ ఆకస్మికంగా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
‘Lord Of The Rings’ Actor Bernard Hill Dies Aged 79https://t.co/4HeGQqb4VOpic.twitter.com/SAzPRI8xlM
— Channels Television (@channelstv) May 5, 2024
Also Read : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు..నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
11 ఆస్కార్ అవార్డులు సొంతం..
ఇక 1912లో జరిగిన ఓడ ప్రమాదాన్ని వెండితెరపై కామెరూన్ అధ్బతంగా ఆవిష్కరించగా.. ఇందులో బెర్నార్డ్ హిల్ ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇక హిల్ టైటానిక్‌తోపాటు ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలోనూ నటించాడు. మొత్తగా తన కెరీర్‌లో సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు, థియేటర్‌లో కూడా పనిచేశాడు. ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న బెర్నార్డ్ ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం విశేషం.