India - Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య 'మెలోడీ' లాంటి ఒప్పందం..!

భారత్-ఇటలీ మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కదలికను సులభతరం చేస్తుంది. మన విద్యార్థులు ఇటలీలో విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు పాటు అదనంగా ఉండొచ్చు.

New Update
India - Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య 'మెలోడీ' లాంటి ఒప్పందం..!

India - Italy: ప్రధాని మోదీ దౌత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన తన మాటలతో, పనులతో ఎలాంటి దేశంతోనైనా కలిసి అడుగులేయగలరు. దేశం కోసం మోదీ నిరంతరం ఆలోచిస్తునే ఉంటారు. మోదీ (PM Modi) దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు అన్నీ దేశాలతోనూ చేతులు కలుపుకోని పోతున్నారు. ఇండియా నుంచి వేరే దేశాలకు.. వేరే దేశాల నుంచి ఇండియాకు ఇచ్చుపుచ్చుకోవడాలు పెరిగిపోతున్నాయి. ఇక మోదీ ఇటలీ ప్రధాని మెలోనీ ఫ్రెండ్‌షిప్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరూ ఓ చోట చేరారంటే చిన్నపిల్లలా మారిపోతుంటారు. ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవం.. అది కేవలం ఫొటోల్లోనూ, వీడియోల్లోనే కాదు.. వర్క్‌లోనూ కనిపిస్తోంది. భారత్‌-ఇటలీ మధ్య బలం మరింత బలపడింది.

విద్యార్థులకు వరం:
భారత్, ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇటలీలోని జార్జియా మెలోని (Giorgia Meloni) ప్రభుత్వం భారతీయ విద్యార్థులను విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు అదనంగా ఉండేందుకు అనుమతించింది. మెలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇండియా విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది. అటు భారతీయ కార్మికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ కోటాను కూడా రిజర్వ్ చేసింది. భారతీయులు స్కెంజెన్ వీసా పొందడానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇటలీ కృషి చేస్తోంది.

వలస ఒప్పందం:
భారత్‌-ఇటలీ ప్రభుత్వాల మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేయాలనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇటలీలో చదువుతున్న విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత 12 నెలల పాటు ఇటలీలో ఉండగలరు. ఈ ఒప్పందం ప్రకారం, ఇటాలియన్ పక్షం నాన్-సీజనల్ భారతీయ కార్మికుల కోసం రిజర్వ్ చేసిన కోటాను 12,000కు పెంచింది. అటు నిజానికి ఇండియాఇటలీ మధ్య సంబంధాలను ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి . భారత్‌కు రోమ్‌లో రాయబార కార్యాలయం, మిలన్‌లో కాన్సులేట్ ఉన్నాయి. ఇటలీకి న్యూఢిల్లీలో రాయబార కార్యాలయం ఉంది. ముంబై మరియు కోల్‌కతాలో కాన్సులేట్ జనరల్‌లు ఉన్నాయి . రెండు దేశాల మధ్య పురాతన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. నేటికీ వారి మధ్య ఆప్యాయత, స్నేహం ఉంది.

Also Read: వారందరికీ షాక్‌.. ఇకపై ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదు.. తేల్చేసిన యూజీసీ!

WATCH:

Advertisment
తాజా కథనాలు