Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్

పాకిస్తాన్ లో ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు నామినేషన్లు దాకలు అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఒక పేరు అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సవీరా పర్కాశ్. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఈమె ఈఫ్రావిన్స్ నుంచి మొదటి మహిళే కాదు..తొలి హిందూ మహిళ కూడా.

Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్
New Update

పాకిస్తాన్ లో ఎన్నికలల్లో హిందూ మహిళ...ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. పాకిస్తాన్ ఎన్నికల్లో సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం కీలక సవరణ చేసింది. ఇప్పుడు దీన్నే పెద్ద ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి అక్కడి మహిళలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఖైబర్‌ పఖ్తుంఖ్వా బనర్‌ జిల్లా నుంచి పోటీకి దిగుతున్నారు సవీరా పర్కాశ్. పాకిస్తాన్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న హిందూ మహిళగా ఈమె వార్తల్లోకి ఎక్కారు.

Also Read:ఈసారైనా గెలిచేనా..ఈరోజు భారత్-సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్

సవీరా ప్రకాష్..పాకిస్తాన్ లో ఉంటున్న హిందూ మహిళ. ఈమె తండ్రి ఓం పర్కాశ్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, వైద్యుడు. ఈయన హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు. ఉచితంగా వైద్యం అందించి పేరు సంపాదించుకున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా 35 ఏళ్ళ పాటుగా ఉన్నారు. కానీ ఈయన ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. ఈయన కూతురు సవీరా మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బర్నర్‌లోని పీకే-25 స్థానానికి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

publive-image

సవీరా పర్కాశ్ కూడా డాక్టర్. ఈమె అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు బనర్‌ పీపీపీ మహిళా విభాగానికి ఈమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తనను రాజకీయాల వైపుకు మళ్ళించిందని చెబుతున్నారు. తాను కనుక గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత, సంక్షేమ సాధన కోసం కృషి చేస్తానని చెబుతున్నారు. ఈమెకు మద్దతుగా ఇమ్రాన్‌ నోషాద్‌ ఖాన్‌ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. పాక్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది.

#elections #nominations #pakistan #hindu-woman #saveera-praksh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe