ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళు కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను ఇచ్చింది. ఇప్పటికే అంగళ్ళుకేసులో 79మందికి ముందస్తు బెయిల్ లభించింది.
అంగళ్ళ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈరోజు వెలువరించింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల తాలూకు ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ గతంలోనే ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. చంద్ర బాబు రేచ్చగోట్టే వ్యాఖ్యల చేశాడని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాన్ని పెన్ డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు మీద ఫిర్యాదును ఆలస్యంగా చేశారని బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఘటన పై ఆలస్యంగా ఫిర్యాదు చేసినా జరిగిన ఘటనలు మొత్తాన్ని కంప్లైంట్ లో తెలిపామన్నారు సుధాకర్ రెడ్డి.
Also Read:చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీలో టెన్షన్.. ముఖ్యనేతల అత్యవసర భేటీ.. అప్డేట్స్ ఇవే!