/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/vanitha-jpg.webp)
AP Elections 2024 : ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని(Election Campaign) ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తానేటి వనిత ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైసీపీ(YCP), టీడీపీ(TDP) శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.
నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో టీడీపీ కార్యకర్తలు హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య యుద్ద వాతావరణం(Weather) నెలకొనగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను టీడీపీ శ్రేణులు బద్దలు కొట్టగా.. దీంతో నల్లజర్ల ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
డీజే వ్యాన్‌లతో పాటు కారు అద్దాలను కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ, పోలీసు బలగాలు అక్కడి వారిని చెదరగొట్టారు. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు.
Also read: నేడు ఓరుగల్లులో మోదీ పర్యటన..వేములవాడలో ప్రత్యేక పూజలు!