AP : ఏపీ రాజకీయాలు(AP Politics) రోజురోజుకి వేడివేడిగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థులు మాటల యుద్దాలకు దిగుతుంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా చేతలకు పని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలు సమతానగర్ లో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒంగోలు(Ongole) వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy) కోడలు కావ్యారెడ్డి(Kavya Reddy) తో పాటు వాలంటీర్ సుజన ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వాలంటీరు పాల్గొనడంతో టీడీపీ కార్యకర్త ప్రభావతి ఎన్నికల ప్రచారానికి వాలంటీర్ ని ఎందుకు తీసుకుని వచ్చారని ప్రశ్నించారు.
దీంతో ఆమెతో పాటు, ఆమె పిల్లల పై కూడా వైసీపీ(YCP) కార్యకర్తలు దాడులకు దిగారు. దాడికి పాల్పడిన వారిలో వైసీపీ నేతలు రామానాయుడు, కృష్ణారెడ్డి, బిన్నీ స్థానిక కార్పొరేటర్ భర్త తిరుపతిరావులు ఉన్నారు. దీంతో టీడీపీ నేత మేడికొండ మోహన్ ఇతర కార్యకర్తలతో కలిసి ప్రభావతిని పరామర్శించడానకిఇ ఆమె ఇంటికి వెళ్లారు. వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డగించి దాడికి దిగారు. దీంతో మోహన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న టీడీపీ(TDP) నేతలు , ఇతర నాయకులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాలంటీర్ సుజనను పరామర్శించేందుకు జిల్లా ఆసుపత్రికి బాలినేని రాగా, టీడీపీ కార్యకర్తలలను పరామర్శించేందుకు జనార్థన్, ఇతర నేతలు అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల నేతలు ఎదురవడంతో అక్కడ ఇద్దరు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవ గురించి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
ప్రచారంలో ఉన్న YCP వారిపై ధాడిచేయడం TDP నాయకులకు ఆనవాయితీ అయ్యిందని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు ఇలానే చేసారు.. ప్రజలు బుద్ధి చెప్పారు తనను ఏమన్నా సహించాను.. తన కుటుంబం జోలికి వచ్చారుఇక నేను ఊరుకోను. నేను ఉన్నంత సహనంగా.. నా అభిమానులు ఉండకపోవొచ్చు అంటూ బాలినేని పేర్కొన్నారు.
దాడులు చేసింది టీడీపీ వారే... ధర్నాలు చేసేది వారే. ప్రచారంలో ఉన్న మా కోడలని, మహిళను ఇష్టమొచ్చినట్లు దుర్బాషలాడితే నేను ఊరుకోను అని హెచ్చరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడూ ఇలాంటి హింసా రాజకీయాలు ప్రోత్సహించలేదని అన్నారు. సహనానికి ఒక హద్దు ఉంటుంది .. అధి దాటితే పరిస్థితులు వేరుగా ఉంటాయి.ఇలాంటి చిల్లర రాజకీయాలు మానకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని బాలినేని అన్నారు.
Also Read : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు!