Ongole: ఒంగోలులో టెన్షన్‌..టెన్షన్‌.. సద్దుమణగని టీడీపీ - వైసీపీ గొడవలు!

ఒంగోలు వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్ వద్ద ఇంకా హై టెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది.టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ... వైసీపీ నేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్‌ స్టేషన్‌ కి రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ

TDP - YCP : ఒంగోలు(Ongole) వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్ వద్ద ఇంకా హై టెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం బాలినేని కోడలు ఎన్నికల ప్రచారానికి(Election Campaign) వెళ్లగా.. ఆమె వెంట వాలంటీర్ కూడా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు వాలంటీర్ ఎందుకు వచ్చిందని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది.

టీడీపీ నేతల పై వైసీపీ నేతలు దాడి చేశారని , వైసీపీ నేతల పై టీడీపీ నేతలు దాడులు చేశారని ఇరు వర్గాల వారు పరస్పరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌ కి వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) ఒంగోలు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. నిన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా వచ్చిన బాలినేనిని ఏసీపీ, సీఐ లు విచారిస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలను వదిలేసి వైసీపీ శ్రేణులను అరెస్ట్‌ చేయడంపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు.. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

Also read: ఎన్‌ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు ఘటన నిందితుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు