Breaking : ఎన్‌ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు ఘటన నిందితుడు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. కేఫ్‌ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్‌ హుస్సెన్‌ కీలక పాత్ర వ్యవహరించాడు.

New Update
Breaking : ఎన్‌ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు ఘటన నిందితుడు!

NIA : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు(Bangalore) లోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe) లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. కేఫ్‌ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్‌ హుస్సెన్‌(Shajib Hussain) కీలక పాత్ర వ్యవహరించాడు. ఎన్‌ఐఏ బృందం నిందితున్ని పట్టుకోవడంలో విజయం సాధించింది.

పేలుళ్లు జరిగిన తరువాత నుంచి పరారీలో ఉన్న ఉగ్రవాది హుస్సేన్‌ ఎన్‌ఐఏ పట్టుకుంది. నిందితుడు అస్సాం(Assam), పశ్చిమ బెంగాల్‌(West Bengal) లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ తో పాటు అతని సహచరుడు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాని కూడా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరూ కర్ణాటకలోని శివమొగ్గలోని ఐఎస్‌ఐఎస్‌ సెల్‌కి చెందిన వారిగా అధికారులు అనుమానిస్తున్నారు.

updated Soon..

Also read: పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు