Bhadrachalam : డేంజర్‌లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

Bhadrachalam : డేంజర్‌లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!
New Update

Godavari : భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. మూడో ప్రమాద హెచ్చరికల చేరువలో గోదావరి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

శ్రీశైలానికి తగ్గుతున్న వరద..

శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 99,615 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,81,235 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 883.5 అడుగులు వద్ద ఉంది.

Also Read : ఈ పథకంలో జస్ట్ రిజిస్టర్ అయితే చాలు.. రెండు లక్షల ఇన్సూరెన్స్! బోలెడు బెనిఫిట్స్!!

#bhadrachalam-floods #godavari #telangana-floods #srisailam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe