Telangana: ప్రణీత్ రావ్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. తన కస్టడీని సవాలు చేస్తూ అతను వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.  కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది హైకోర్టు. 

New Update
Telangana: ప్రణీత్ రావ్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. తన కస్టడీని సవాలు చేస్తూ అతను వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.  కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది హైకోర్టు. కస్టడీ మీద  నాంపల్లి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని హైకోర్టు భావించింది.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సస్పెండెడ్ డీఎస్సీ డిలీట్ చేసుకున్న వాట్సాప్ చాట్ ను పోలీసులు రిట్రీవ్ చేయడంతో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో తాను టాపింగ్ కు పాల్పడ్డానని ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. సదరు నేత వంద మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి టాప్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.

అసలేం జరిగింది:
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Also Read:International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్‌ కేసులో ఇటలీ ప్రధాని

Advertisment
తాజా కథనాలు