Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు మీద ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన రిట్ పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ టాకుర్,రఘునానందరవు బెంచ్ దీన్ని మరో బెంచ్ కు బదిలీ చేశారు.

New Update
Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

హై కోర్టులో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ టాకుర్,రఘునానందరవు బెంచ్ ముందుకు చంద్రబాబునాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన రిట్ పిటిషన్ వచ్చింది. నాట్ బిఫోర్ మీ అని న్యాయమూర్తులు రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ చేశారు. అయితే ఏ బెంచ్ కు వెళ్ళింది, ఎప్పుడు విచారణ చేస్తారు మాత్రం చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఉండవల్లి రిట్ పిటిషన్ దాఖలు చేసారు. 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలుకేసును సిఐడి నుంచి సీబీఐ విచారణకు ఇవ్వాలని ఉండవల్లి పిటిషన్ లో కోరారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ED,చంద్ర బాబు,అచ్చెన్నాయుడు లను ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ మీద మరి కాసేపట్లో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాదనలు జరగనున్నాయి. ఇందులో బాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ వాదించారు.

దీంతో పాటూ చిత్తూరు అంగళ్ళు ఘటన కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో చాలా మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. అందుకే బాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ ను ఏ14 చేర్చారు.

Advertisment
తాజా కథనాలు