Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ సీటు.. భట్టి, పొంగులేటికి సీఎం రేవంత్ షాక్?

కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఖమ్మం MP టికెట్‌ను సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి కాంగ్రెస్‌లో ఇదే టికెట్ కొరకు పోటీ పడుతున్నారు. మరి వీరిని కాదని కామ్రేడ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అనేది చూడాలి.

Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ సీటు.. భట్టి, పొంగులేటికి సీఎం రేవంత్ షాక్?
New Update

Khammam MP Ticket: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారెంటీల (Congress Six Guarantees) పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్స్ వేస్తోంది.

ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలో.. తెలంగాణలో సరికొత్త వ్యూహం తాయారు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లెఫ్ట్ నేతల సమాలోచనలు చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటును సీపీఐ (CPI) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

అప్పుడు వద్దు.. ఇప్పుడు పొత్తు..

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) తో పొత్తు వద్దు అనుకోని ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందిన సీపీఎం.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో ఓ పార్లమెంట్ స్థానంలో పోటీలో ఉంటామని అంటుంది సీపీఎం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానాల్లో ఏదో ఒక స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌పై సీపీఐ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పరోక్షంగా ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని సీపీఐ, సీపీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏఐసీసీపై ఒత్తిడి పెంచేందుకు అగ్రనేతలను రంగంలోకి ఇరు పార్టీలు దింపినట్లు తెలుస్తోంది.

భట్టి , పొంగులేటికి షాక్?

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నిలిచింది. అయితే.. ఇప్పుడు ఇదే ఖమ్మం తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ స్థానం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ గట్టిగానే ఉంది. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas) సోదరుడు ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, మంత్రి తుమ్మల కుమారుడు ఉన్నారు. తాజాగా పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నా సీపీఐ, సీపీఎం పార్టీలకు టికెట్ కేటాయిస్తే మంత్రుల నడుమ టికెట్ పంచాయతీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారని గాంధీ భవన్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఖమ్మం టికెట్ కామ్రేడ్ లకు దక్కుతుందా? లేదా మంత్రుల్లోని కుటుంబ సభ్యుల్లో ఒకరికి దక్కుతుందా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Also Read: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

#cpi #cm-revanth-reddy #khammam-mp-ticket #minister-ponguleti-srinivas #lok-sabha-elections-2024 #bhatti-vikramarka #cpm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe