Yamaha: ఈ యమహా స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు.. తెలుసుకోండి!

మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం.

New Update
Yamaha: ఈ యమహా స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు.. తెలుసుకోండి!

Yamaha AEROX: యమహా కంపెనీ ఈమధ్య భారతదేశంలో Aerox 155 వెర్షన్ Sని విడుదల చేసింది. స్కూటర్ లైనప్‌లో ఇది నెక్ట్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ కొత్త వేరియంట్ యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారంలో భాగమైంది. దీని ధర రూ.1,50,600 (ఎక్స్-షోరూమ్). బ్లూ స్క్వేర్ షోరూమ్‌లో ఇవి ప్రత్యేకంగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

AEROX 155 వెర్షన్ S యొక్క ముఖ్య ఫీచర్ దాని స్మార్ట్ కీ టెక్నాలజీ. పట్టణ ప్రయాణాన్ని మెరుగుపరచడానికి దీన్ని రూపొందించారు. సిస్టమ్ ఆన్సర్ బ్యాక్, అన్‌లాక్, ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది రైడర్‌లకు సౌలభ్యం, భద్రత రెండింటినీ అందించడమే లక్ష్యంగా రూపొందించినది.ఆన్సర్ బ్యాంక్ ఫంక్షన్ (Answer Bank Function) రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది వీడియో, ఆడియో సిగ్నల్‌లతో స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. కీలెస్ ఇగ్నిషన్ స్మార్ట్ కీ సిస్టమ్ మరొక ప్రయోజనం ఏమిటంటే, కీ వాడకుండానే స్కూటర్‌ను ప్రారంభించవచ్చు. ఈ ఫంక్షన్, ఇమ్మొబిలైజర్ ఫంక్షన్‌తో పాటు, కీ దగ్గరగా లేనప్పుడు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా స్కూటర్ చోరీ అవ్వకుండా చేసుకోవచ్చు.

Also Read: మొహానికి టూత్ పేస్ట్ అప్లై చేస్తున్నారా..? మీ అందం పాడైనట్లే..జాగ్రత్త..!

స్మార్ట్ కీ సిస్టమ్‌తో పాటు, కొత్త Yamaha AEROX 155 వెర్షన్ S, X సెంటర్ మోటిఫ్ ద్వారా హైలైట్ అయిన అథ్లెటిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ట్రాక్షన్ కంట్రోల్‌ అమర్చి ఉంది. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో కూడిన కొత్త-తరం 155cc బ్లూ కోర్ ఇంజన్‌ కలిగివుంది. ఇది 8,000rpm వద్ద 15bhp శక్తినీ, 6,500rpm వద్ద 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అధిక పనితీరు, సామర్థ్యంల కలయిక. సిటీ రైడింగ్‌కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.స్కూటర్ E20 ఫ్యూజ్ అనుకూలమైనది, ప్రామాణిక ప్రమాద హెచ్చరిక సిస్టమ్‌తో పాటు ఆన్‌బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD-II) సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని కొలతలు, ఫీచర్లు సౌకర్యవంతమైన, డైనమిక్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించినవి. AEROX 155 వెర్షన్ S బరువు 126 KG మాత్రమే. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 145 మిల్లీమీటర్లు. దీనితో పాటు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.5 లీటర్లు.

Advertisment
తాజా కథనాలు