Israel -Iran: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు

లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్‌ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీలు కూడా శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు.

New Update
Israel -Iran: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియె హత్యతో యుద్ధ వాతావరణం నెలకొంది. హనియె హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్‌ ఆరోపించింది. ప్రతీకారం తప్పదంటూ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్‌ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. ఈ విషయాన్ని హెజ్బుల్లా అధికారికంగా ప్రకటించింది. ముందునుంచే ఇరాన్‌కు హిజ్బుల్లా మద్దతిస్తోంది. అయితే హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది.

Also Read: సెప్టెంబర్‌‌లో కమలా హారిస్, ట్రంప్ మధ్య డిబేట్

మరోవైపు ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఆ దేశానికి జెట్స్‌, యుద్ధ నౌకలు పంపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు హెచ్చరించాయి. భారత్‌ కూడా ఈ రెండు దేశాలకు ఎవరూ వెళ్లకూడదని సూచించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న ఇండియన్స్‌ అప్రమత్తంగా ఉండాలన్న భారత ఎంబసీ తెలిపింది. ఇప్పటికే ఆయా దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్‌, లెబనాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేశాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది.

ఇదిలాఉండగా.. యెమెన్‌ కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటులుదారులు కూడా మళ్లీ వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించారు. గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు. ఇజ్రాయెల్ వారిపై వైమానిక దాడులు జరిపిన తర్వాత ఇలా దాడులు చేయడం ఇదే మొదటిసారి. ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై తరచూ నౌకలకు పాల్పడుతున్న హౌతీలు దాదాపు రెండు వారాల వరకు విరామం ఇచ్చారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. హమాస్‌ నేత హనియా హత్య సహా కీలక పరిణామాలు జరిగిన అనంతరం హూతీలు మరోసారి దాడులు చేయడం కలకలం రేపుతోంది. మొత్తానికి పశ్చియాసియా నెలకొన్న యుద్ధ వాతావరణం అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడివారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Also Read: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి

Advertisment
తాజా కథనాలు