Rashmika : రష్మిక మందాన(Rashmika Mandanna) ఏప్రిల్ 5 1996లో కర్ణాటక(Karnataka) లోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట్ లో జన్మించింది. సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి... నటన మీద ఆసక్తితో మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది. ముందు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని తన మీద పడేటట్లు చేసుకుంది.
టాలీవుడ్(Tollywood) లో తన మొదటి సినిమా ఛలో(Chalo) .. ఇందులో నాగ శౌర్య పక్కన ఆడి పాడి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత ఆమె నటించిన గీతాగోవిందం రష్మిక కెరీర్ ని ఓ మలుపు తిప్పింది. ఆ సినిమా తరువాత రష్మిక డైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరు అంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
ఆ సినిమా తరువాత రష్మిక ని అందరూ ముద్దుగా నేషనల్ క్రష్(National Crush) అంటూ పిలుచుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత రష్మిక సినీ ప్రపంచంలో వెనుదిరిగి చూడనే లేదు. పుష్ప సినిమాతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. సంవత్సరాలు గడుస్తున్న కానీ రష్మిక ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక అనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటింది. సందీప్ వంగా(Sandeep Vanga) డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ (Animal) సినిమా తో పెద్ద హిట్ ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలో ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ రష్మిక దక్కించుకోవడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 5.6మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగిన నటి రష్మిక సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది.
ప్రస్తుతం నేషనల్ క్రష్ చేతినిండా సినిమాలున్నాయి. దీంతో ఆమె ఖాళీ లేకుండా బిజీబిజీగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నేషనల్ క్రష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు నెట్టింట విషెస్ తెలుపుతున్నారు. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు సైతం రష్మికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కెరీర్ లో ఇలాగే ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ ఆర్టీవీ(RTV) రష్మిక కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
Also read: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు