Heroin Anjali About Her Marriage: హీరోయిన్లు వాళ్ళ ఎఫైర్లు, పెళ్ళిళ్ళు..మీడియాకు ఇది బర్నింగ్ టాపిక్. పబ్లిక్ ఫిగర్ అయితే చాలు వాళ్ళకు ఫ్రీడమ్ పోతుంది. ఎవరితో కనిపించినా...కొంచెం క్లోజ్‌గా ఉన్నా చాలు సంబధాలు అంటగ్టటేస్తారు. ప్రేమ, పెళ్ళి అంటూ ఊదరగొట్టేస్తారు. తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి గురించికూడా ఇలానే చాలా వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు. ఆమధ్య కొంతకాలం క్రితం కొన్నాళ్ళు పాటూ ఈమె కనిపించలేదు. దానికి కూడా ఒక కథ చెప్పేశారు. తరువాత అంజలి బయటకు వచ్చి బాబోయ్ నాకేం అవలేదు. నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంది. అలానే అంజలి మీద నిత్యం ఏవో ఒక వార్తలు వినిపిస్తూను ఉంటాయి.
తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంజలి. ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ బిజిగా తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి అంజలి పెళ్ళి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.విడాకులు తీసుకున్న ఓ తెలుగు అగ్ర నిర్మాతతో ఏడాదిగా అంజలి డేటింగ్ చేస్తున్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. వీటి మీద ఈమె రియాక్ట్ అయింది. నాకు ఇప్పటికి నాలుగుసార్లు పెళ్ళి చేసేశారు. ఇది ఐదవసారి అంటూ చెప్పుకొచ్చింది. నా పెళ్ళి వార్తలన్నీ ఫేక్ న్యూస్‌లే అస్సలు నమ్మొద్దని చెబుతోంది. నేను పెళ్ళి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను...అయినా ఇప్పటల్లో నాకు వివాహం చేసుకునే ఉద్దేశం లేదని అంటోంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తోంది అంజలి. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగమ్మాయి అంజలి. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అంజలి నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో నటిస్తోంది హీరోయిన్ అంజలి. పాత్రల ఎంపికలో సెలెక్టీవ్ గా వెళుతూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.
Also Read:Santhi Swaroop: మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత