Siddharth Marriage: గుడిలో సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న అదితి - సిద్దార్థ్..! హీరో సిద్దార్థ్, నటి అదితిరావు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. వనపర్తిలోని శ్రీరంగనాథ ఆలయంలో సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. By Archana 27 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Siddharth and Aditi Rao Hydari Marriage News: 'మహాసముద్రం' సినిమాలో కలిసి నటించిన సిద్దార్థ్, అదితి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్స్ కూడా హాజరయ్యారు. దీంతో అందరు సిద్దార్థ్, అదితి నిజంగానే ప్రేమలో ఉన్నట్లుగా భావించారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని.. వారిద్దరూ కేవలం స్నేహితులమే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ జంట. Also Read: Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..! సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్, అదితిరావు అయితే తాజాగా వీరిద్దరి ప్రేమకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సిద్దార్థ్, అదితి వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వనపర్తిలోని (Wanaparthy) శ్రీరంగనాథ ఆలయంలో వీరిద్దరూ సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి సంస్థానాధిపతుల వారసుల్లో అదితి ఒకరు కావడంతో ఆ సంస్థానానికి చెందిన ఆలయంలో అదితి వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సిద్దార్థ్ (Hero Siddharth) , అదితి జంటకు విషెష్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కానీ దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే.. అదితి, సిద్దార్థ్ ఇద్దరికీ ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. గతంలో సిద్దార్థ్ మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2007 లో వీరిద్దరూ విడిపోయారు. ఇక అదితి విషయానికి వస్తే గతంలో సత్య డీప్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె .. 2012 లో విడాకులు తీసుకున్నారు. Also Read: Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్ #hero-siddarth #siddarth-aditi-marriage #aditi-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి