Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..! రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తల్లి సురేఖ కొణిదెల అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరుపున అపోలో హాస్పిటల్స్ ఆలయంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆమె స్వయంగా భక్తులకు వడ్డించారు. By Archana 27 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ram Charan's Mother Surekha Gift: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఇక ఈరోజు తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సోషల్ మీడియా అంతా చరణ్ ఫొటోలు, వీడియోలతో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. సామాన్య వ్యక్తుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరు ఈ మెగా హీరోకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్ హీరోలు చరణ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. కొంత మంది పోస్టుల ద్వారా తమ ప్రేమను తెలియజేస్తే.. మరి కొంత మంది స్పెషల్ గిఫ్ట్స్ తో చెప్పారు. Also Read: Game Changer: “జరగండి జరగండి”.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్ ఇక రామ్ చరణ్ మదర్ సురేఖ కూడా చరణ్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా తాను రీసెంట్ గా ప్రారంభించిన అత్తమ్మాస్ కిచెన్ (Athammas Kitchen) సంస్థ తరుపున అపోలో హాస్పిటల్స్ ఆలయంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆమె స్వయంగా వంటలు చేయించి భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి కూడా హాజరయ్యారు. ఈ విషయాన్నీ ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఉపాసన, సురేఖతో పాటు అల్లు అర్జున్, ఉపాసన అమ్మ గారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) Also Read: Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్ #konidela-surekha-gift #ram-charan-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి