Actor Nani : బలగం వేణు డైరెక్షన్‌లో నేచురల్‌ స్టార్‌ నాని!

నేచుర్‌ స్టార్‌ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్‌ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Actor Nani : బలగం వేణు డైరెక్షన్‌లో నేచురల్‌ స్టార్‌ నాని!
New Update

Nani : కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు (Balagam venu) . ఆ తరువాత జబర్దస్త్‌ ద్వారా మరింత పేరు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగకుండా దర్శకునిగా మారి బలగం (Balagam) సినిమా తీసి ఎన్నో అవార్డులు (Awards) కూడా అందుకున్నాడు. మొదటి సినిమాతోనే బ్లక్ బస్టర్‌ హిట్‌ ని అందుకున్నాడు వేణు.

ఈ క్రమంలోనే తన రెండో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలు పెట్టినట్లు వేణు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేణు నేచురల్ స్టార్‌ నానితో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు హీరో నాని తెలిపాడు. ఈ ఏడాది నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

ఆయన నటించిన సినిమాలన్ని కూడా మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా ఆయన నటించిన హాయ్‌ నాన్న (Hi Nanna) సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రమోషన్స్‌ లో భాగంగా అభిమానులతో సోషల్‌ మీడియాలో ఇంటరాక్ట్‌ అయ్యారు.

ఇందులో నాని అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుల్లో ఏ దర్శకునితో మీరు పని చేయాలనుకుంటున్నారు అని ఓ అభిమాని అడగగా..దానికి నాని వెంటనే బలగం వేణు అని బదులిచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

నాని హాయ్‌ నాని సినిమా తరువాత సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నాని 31 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలే అంటే సుందరానికి వంటి హిలేరియస్‌ కామెడీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు.

Also read: మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత!

#new-movie #balagam-venu #balagam #hai-nanna #direction #nani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe