Movies:నాగార్జున డ్రస్, షూస్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే. తెలుగు సినిమాల్లో నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. వయసు ముదురుతున్నా ఎక్కడా కనిపించకుండా మెయిన్ టెయిన్ చేసే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. మంచి మంచి డ్రెస్ లతో కనువిందు చేస్తుంటారు. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్, షూస్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. By Manogna alamuru 28 Nov 2023 in Uncategorized New Update షేర్ చేయండి సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ఏం చేసినా రిచ్ గా చేస్తారు. వాళ్ళు వేసుకునే బట్టలు, షూస్, వాచ్ ఇలా ఏదయినా లక్షల్లో, కోట్లలో ఉంటాయి. అన్నీ టాప్ బ్రాండ్సే వాడతారు కూడా. చూడ్డానికి బావున్నా లేకపోయినా...దాని ధరను బట్టి వాల్యూ వచ్చేస్తోంది. తాజాగా తెలుగు తెర మన్మధుడు ధరించిన షర్ట్, షూస్ సెటంర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. దాంతో వాటి ధరలు కూడా అవాక్కయ్యేలా చేశాయి. 64 ఏళ్ళ వయసులోనూ కుర్రాళ్ళతో పోటీ పడే అందం నాగార్జునది. ఓ పక్క సినిమాలు చేస్తూనే బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ లో ప్రతీ వీకెండ్ కు వచ్చే నాగార్జున రకరకాల డ్రస్ లు వేసుకుని వస్తూ ఉంటారు. చూడ్డానికి భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. అయితే నాగార్జునకు మాత్రం అవి పరెఫెక్టగా సూట్ అవుతాయి. బిగ్ బాస్ షో కి నాగార్జున వేసుకుని వచ్చే డ్రెసెన్ అన్నీ టాప్ క్లాస్ బ్రాండ్‌లకు సంబంధించినవే అయి ఉంటాయి. అలా మొన్న శనివారం.. రంగులతో పెయింట్ వేసినట్లుగా ఉన్న షర్ట్ ధరించాడు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర ఏకంగా రూ.1,03,019గా ఉంది. ఆదివారం రోజు ఆయన వైట్ స్వెట్‌షర్ట్ ధరించాడు. లూయిస్ వ్యూటన్‌కు చెందిన దీని ధర అయితే ఇంకా ఎక్కువ. ఆ స్వెట్ షర్ట్ ధర అక్షరాలా రూ.1,82,016 అని చెబుతున్నారు. ఇక నాగార్జున ఆ రోజు వేసుకున్న షూస్ ధర కూడా లక్షా పాతిక వేలకు పైమాటే అంటున్నారు. అంతకు ముందు వారంలో వేసుకున్న యెల్లో అబస్ట్రాక్ట్ ప్రింట్ షర్ట్ ధర అయితే వీటన్నింటినీ మించి ఉంది. దాని ధర ఏకంగా 2, 25,000 అంట. బిగ్ బాస్ లో నాగార్జున వేసుకుంటున్న షర్ట్లు అన్నీ దాదాపు ఇవే ధరల్లో ఉంటాయని చెబుతున్నారు. ఎంతైనా స్టార్ హీరో కదా.. ఆమాత్రం మెయింటెన్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు. పైగా అక్కడున్నది ఎవరు మన్మధుడు నాగార్జున కదా అని చెబుతున్నారు. #nagarjuna #price #biggboss #shirt #branded మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి