Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్‌ ఫైనల్‌కు ప్రిన్స్‌ మహేశ్‌..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరలవుతోంది.

Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్‌ ఫైనల్‌కు ప్రిన్స్‌ మహేశ్‌..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే?
New Update

Bigg Boss 7 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. సీజన్ 7 విజేత ఎవరో తెలియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. గతంలో సీజన్ 6 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించాయి. దీంతో బిగ్ బాస్ టీమ్ సీజన్ 7 పక్కాగా ప్లాన్ చేశారు. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ సూపర్ హిట్ అనే టాక్ ఎక్కువగా వినిపించింది.

publive-image

ఇక సీజన్ 7 ఫైనల్ కు చేరుకున్న నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా రాబోతుంది ఎవరని ప్రేక్షకులలో చర్చ మొదలైంది. సీజన్ 1, 3 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సందడి చేశారు. సీజన్ 2లో విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక 5,6 సీజన్స్ లో ప్రభాస్ (Prabhas), ఎన్ఠీఆర్ ముఖ్య అతిథులుగా వస్తున్నారనే టాక్ నడిచింది. కానీ నాగార్జున తోనే ట్రోఫీ అందించి మమ అనిపించారు బిగ్ బాస్ టీమ్.

ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సూపర్ సక్సెస్ అయిన సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరలవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు అండ్ టీమ్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేయనున్నట్లు టాక్. బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు దాటుకొని కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఫైనల్ కు చేరుకున్నారు. అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అర్జున్ ఫైనల్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్, శివాజీ టైటిల్ రేస్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది.

publive-image

Nagarjuna: "ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల".. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్ - Rtvlive.com

#bigg-boss-7 #mahesh-babu #nagarjuna #bigg-boss-7-telugu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe