Nagarjuna: "ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల".. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై డైరెక్టర్ విజయ్ బిన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. By Archana 11 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naa Saami Ranga Movie: నాగార్జున (Nagarjuna) హీరోగా డైరెక్టర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా సామిరంగ". దర్శకుడిగా విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ నాగార్జున మాస్ యాక్షన్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృదం సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా "నా సామిరంగ" నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. బెల్లం సెరుకు సూపుల దాన..అల్లం మిరప మాటల దాన.. నువ్వట్టా పోతుంటే.. నిన్నిట్టా సూత్తుంటే.. ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల.. ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే అంటూ పల్లెటూరి యాసలో సాగిన ఈ పాటలో నాగార్జున, ఆషికా సింపుల్ డాన్స్ మూవ్స్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ పాటలోని పల్లెటూరు బ్యాక్ డ్రాప్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా కనిపించాయి. ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం. ఎం. కీరవాణి (M M Keeravani) సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. సింగర్ రామ్ మిరియాల ఈ పాటను పాడారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ బిజీగా సాగుతుంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ వరలక్ష్మి పాత్రలో నాగార్జున సరసన కనిపించనుంది. ఆషికా 'అమిగోస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన.. ఆషికా నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. Also Read: Vasanthi Krishnan: పవన్ తో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్! #nagarjuna-movie-naa-saami-ranga #naa-saami-ranga #akkineni-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి