Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. By B Aravind 25 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kid Travel : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది(RPF Staff) సురక్షితంగా రక్షించారు. ఆ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(Child Welfare Committee) కి అప్పగించారు. అలాగే చిన్నారి తండ్రిని కూడా సంప్రదించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. దీనిపై విచారణ జరిపించాలని రైల్వేశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also read: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్.. ఎందుకంటే ఇక వివరాల్లోకి వెళ్తే.. చార్బాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఓ గూడ్స్ రైలు బయలుదేరింది. అయితే అది స్టార్ట్ కాకముందే ఓ ఐదేళ్ల బాలుడు(5 Years Old Boy) ఆడుకుంటూ ఆ రైలు వద్దకు వచ్చాడు. ఆ తర్వాత దాని చక్రాల మధ్యకు వెళ్లి నిద్రపోయాడు. అయితే ఒక్కసారిగా కదలడంతో ఆ బాలుడు బయటికి రాలేకపోయాడు. చివరికి ఆ చక్రాలపైనే కూర్చుని 100 కి.మీ వరకు ప్రయాణించాడు. హర్దోయ్ రైల్వే స్టేషన్‌కు ఆ గూడ్స్ రైలు వచ్చాక ఆర్ఫీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు. చివరికి ఆ రైలు చక్రాల మధ్య బాలుడు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. ఆ తర్వాత చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి.. అతడి తండ్రిని కూడా సంప్రదించారు. ఆ బాలుడు జరిగిందంతా అధికారులకు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. मालगाड़ी के पहियों के बीच बैठकर हरदोई पहुँचा बच्चा आरपीएफ़ ने किया रेस्क्यू रेलवे ट्रैक के किनारे रहने वाला है मासूम खेलते खेलते ट्रैक पर खड़ी मालगाड़ी पर चढ़ा मालगाड़ी चल दी और बच्चा नहीं उतर पाया रेलवे सुरक्षा बल के जवानों ने बच्चे को उतारा बच्चे को चाइल्ड केयर हरदोई के… pic.twitter.com/D8A1Xqbbho — News1Indiatweet (@News1IndiaTweet) April 21, 2024 Also read: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య #telugu-news #national-news #viral-video #indian-railways #kid-travel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి