Raisi: ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు.. జాడ కోల్పోయిన హెలికాప్టర్‌!?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అజర్‌బైజాన్‌ను సందర్శిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, హెలికాప్టర్‌లో అధ్యక్షుడితో సహా ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సివుంది.

New Update
Raisi: ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు.. జాడ కోల్పోయిన హెలికాప్టర్‌!?

Iranian President Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అజర్‌బైజాన్‌ను సందర్శిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, హెలికాప్టర్‌లో అధ్యక్షుడితో సహా ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు హెలికాప్టర్ల కాన్వాయ్‌లో రెండు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది.

రైసీ ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ప్రయాణిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ దేశంతో సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో ఈ సంఘటన జరిగిందని ప్రముఖ ఛానల్ తెలిపింది. రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్ సైట్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. కొద్దిపాటి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభించేందుకు రైసీ ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్‌లో ఉన్నారని నివేధికలు వెల్లడించాయి.

Also Read: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఫైర్.. చీప్ గా వ్యవహరించారంటూ..!

Advertisment
తాజా కథనాలు