Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పొంగిపోర్లుతోంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం నిండు కుండలా మారింది. దీంతో శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తే అవకాశం కనిపిస్తోంది.

New Update
Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం

Srisailam Project: కృష్ణా బేసిన్‌ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుండడంతో..ఆ నీటిని అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు. అయినా కూడా శ్రీశైలం జలాశయం నిండపోతుండడంతో ఇక్కడ మరో సారి గేట్లు ఎత్తక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎగువ ప్రాంతాల నుంచి 1.37 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ స్థాయి 885 అడుగులు కాగా..ఎగువ నుంచి వచ్చి చేరిన నీటితో 884.2 అడుగుల నీరు నిండిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 210.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగి గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నా లేదా దాటిపోయినా గేట్లు ఎత్తాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదలు..13 మంది మృతి

Advertisment
తాజా కథనాలు