భారీ వర్షాలకు, వరదలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం అవుతున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్‌లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి నదులు ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో 252 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రంగంలోకి దిగిన వైమానికి దళం ఏడుగురిని రక్షించింది. మరోవైపు బీహార్‌లో కూడా వరదలు పోటెత్తుతున్నాయి. గండక్, కోసి, బాగమతి, మహానంద వంటి నదుల ఉగ్రరూపందాలుస్తున్నాయి. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, మధుబని, కోసం, సీమాంచల్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Also Read: ఆ వికలాంగునికి ఉద్యోగం ఇవ్వండి: సుప్రీంకోర్టు
ఈ నేపథ్యంలో కోసి బ్యారేజీ నుంచి రికార్డ్ స్థాయిలో 3.65లక్షల క్యూసెక్కులు, గండక్ బ్యారేజీ నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గత 20 ఏళ్లలో అత్యధికంగా నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇక ఉతరాఖండ్‌లో కొద్దిరోజులుగా కుండపోత వానలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. హైవేలు సహా 200 రోడ్లు క్లోజ్ అయ్యాయి.
మరోవైపు అసోంలో 27 జిల్లాలపై వరదల ప్రభావం ఉంది. వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 92 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 12 వరకు ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
Also Read: రోస్టింగ్ పేరుతో రోత కామెంట్లు.. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్!