Weather Alert: తెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రాగల ఐదురోజు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో రానున్న ఐదురోజు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: మూడు దఫాలుగా రైతు రుణ మాఫీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు