/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-22-3.jpg)
Rain Alert To Telangana: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేటతోపాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
Also Read: షాకింగ్ ఘటన.. రోడ్డుపైకి వచ్చిన పెంపుడు కుక్కలు ఎంత పని చేశాయంటే?
తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు భారీగా వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జులై 13 నుంతి జులై 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: హైదరాబాద్‌లో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష!
Follow Us