Heavy rains: నీటమునిగిన ఖమ్మం.. మున్నేరు వాగు మహోగ్రరూపం

ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధమయ్యింది. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. రాజీవ్‌ గృహకల్ప ఇళ్ల సముదాయాలు నీటమునిగాయి. దీంతో భవనాల టెర్రస్‌పైకి వెళ్లి దాదాపు 200 కుటుంబాలు తల దాచుకుంటున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి.

New Update
Heavy rains: నీటమునిగిన ఖమ్మం.. మున్నేరు వాగు మహోగ్రరూపం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధమయ్యింది. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. రాజీవ్‌ గృహకల్ప ఇళ్ల సముదాయాలు నీటమునిగాయి. దీంతో భవనాల టెర్రస్‌పైకి వెళ్లి దాదాపు 200 కుటుంబాలు తల దాచుకుంటున్నాయి. తమను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకి కోసం సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

Also Read: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే!

మున్నేరు, ఆకేరు వాగులు భయంకరంగా ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మున్నేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆదేశించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు