Telangana: భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయిన తండ్రికూతురు..

మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న నూనావత్ మోతిలాల్, అతని కూతురు అశ్విని కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.

New Update
Telangana: భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయిన తండ్రికూతురు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న తండ్రి, కూతుర్లు కూడా కారుతో పాటు గల్లంతయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి మండలం గేట్‌కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, అతని కూతురు అశ్విని హైదరాబాద్‌ విమానశ్రయానికి బయలుదేరారు. ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వారు ప్రయాణిస్తున్న కారు నీటిలో మునిగిపోయింది.

Also Read: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు

దీంతో కారు వాగులో మునిగిందని, మెడ వరకు నీళ్లు వచ్చాయని ఆ తండ్రి కూతర్లు తమ బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన బంధువులు ఘటనాస్థలానికి బయలుదేరారు. అయితే ఇప్పుడు వారి ఫోన్స్ స్విచ్చాఫ్ వస్తున్నాయి. కారు కూడా కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది తండ్రి,కూతుర్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా అశ్వినీ అగ్రీకల్చర్‌ విభాగంలో సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమెకు రాయ్‌పూర్‌లో జరిగిన ఇంటర్నేషన్‌ కాన్ఫరెన్స్‌లో యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా దక్కింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు